తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
గత నెల రోజులుగా తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు చాలా స్వల్పంగా నమోదవుతున్నాయ్. అయితే ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో ఉష్ణోగ్రతలు సైతం పెరుగుతున్నాయి. అయితే బంగాళాఖాతంలో తిరిగి అల్పపీడనం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుండటంతో మళ్లీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే మంగళవారం గణేష్ నిమజ్జనం ఉండటం, నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ వారం తెరపనిస్తే బాగుండని ప్రజలు కోరుకుంటున్నారు.