Home Page SliderInternational

గ్రూమింగ్ ఉచ్చులో బ్రిటన్ అమ్మాయిలు, రిషి సునాక్ భరోసా

గ్రూమింగ్ గ్యాంగ్‌లను ఉక్కుపాదంతో అణచి వేయడానికి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిర్ణయించుకున్నారు. బాలికలను, యువతులను వేధించే ఈ గ్రూమింగ్ గ్యాంగ్‌లను ఉపేక్షించలేమని, వారి కార్యకలాపాల విషయంలో ప్రత్యేక పోలీస్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు రిషి. గత ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ గ్యాంగ్స్‌ను పట్టించుకోలేదని, తమకు అటువంటి ప్రయోజనాలు అవసరం లేదన్నారు. తాజాగా బ్రిటన్ హోం మంత్రి సుయెలా బ్రావెర్మన్ వ్యాఖ్యల ప్రకారం ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ పేరు వింటేనే బాలికల తల్లి దండ్రులు వణికి పోతున్నారని,ఈ గ్యాంగుల్లో బ్రిటిష్ పాకిస్థానీల ప్రమేయం ఉందన్నారు.

ఈ గ్యాంగ్‌లు పిల్లలను, యువతులను ట్రాప్ చేసి, వారితో సంబంధాలు పెట్టుకోవడం, లైంగిక అవసరాలకు వాడుకోవడం, మానవ అక్రమ రవాణా చేయడం వంటి అరాచకాలు చేస్తుంటారు. వారి భావోద్వేగాలను ఉపయోగించుకుని వారితో సంబంధాలు పెట్టుకుంటారు. ఈ పనిలో వారు ఒక గ్యాంగ్‌ వలే పని చేస్తారు. ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటారు. ఇలా వారిని గుప్పెట్లో పెట్టుకుని, వారికి మాదకద్రవ్యాలు అలవాటు చేయడం, బ్రెయిన్ వాష్ చేయడం వంటి పనులు కూడా చేస్తున్నారు. ఇలాంటి కేసులు అత్యధికంగా పాకిస్థానీలున్న గ్యాంగ్‌లే పిల్లలను పదేళ్ల వయస్సు నుండే మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ది ఇండిపెండెంట్ ఎంక్వైరీ ఇన్ టూ చైల్డ్ సెక్స్‌వల్ అబ్యూజ్ సంస్థ ఏడేళ్లుగా శ్రమించి తయారు చేసిన నివేదిక ప్రకారం రాజకీయ నాయకులు వారి లబ్ది కోసం దశాబ్దాల కొద్దీ ఈ దుర్మార్గాన్ని అణచి పెట్టారని తెలుస్తోంది. ప్రధాని రిషి సునాక్ ఏర్పాటు చేసిన ఈ టాస్క్‌ఫోర్స్‌లో ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. నేషనల్ క్రైమ్ ఏజెన్సీ సహాయంతో వీరు పని చేస్తారు. ఈ గ్యాంగులను కఠినంగా శిక్షించేలా చట్టాలను తీసుకురానున్నారు.