బ్రిటన్ ప్రధాని ఫ్రంట్ రన్నర్‌గా రిషి సునక్.. 10 కీలక పాయింట్లు
లిజ్ ట్రస్ రాజీనామా తర్వాత రిషి సునక్ గెలిస్తే… UK ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన మొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి అవుతాడు.
వచ్చే వారం చివరిలోగా తన వారసుడిని ఎన్నుకుంటానని ప్రకటించారు. ట్రస్ మినీ బడ్జెట్, మార్కెట్ల దారుణంగా దెబ్బతినడం, ద్రవ్యోల్బణం ఆమె రాజీనామాకు కారణమయ్యాయి. బ్రిటన్ వ్యాప్తంగా పెరుగుతున్న ధరల మంట రాజీనామా దిశగా అడుగులు వేయించిందని నిపుణులు చెబుతున్నారు.

1) లిజ్ ట్రస్ కష్టాలు ఆమె షో పీస్ టాక్స్-స్లాషింగ్ విధానం మార్కెట్ గందరగోళానికి దారితీసింది. అవమానకరమైన U-టర్న్‌లు తీసుకోవాల్సి వచ్చింది.
2) UK ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడానికి ఉద్దేశించిన ఎత్తుగడలు, పదవిలోకి వచ్చిన 45 రోజులకే ఆమెకు పార్టీలో విమర్శలకు కారణమయ్యింది. కన్జర్వేటివ్ పార్టీ రెండుగా చీలిపోయింది.
3) లిజ్ ట్రస్ నిష్క్రమణతో కన్జర్వేటివ్ పార్టీ ప్రతిష్ట గంగలో కలిసింది. పన్నెండున్నరేళ్ల అధికారం తర్వాత ఎన్నికలలో లేబర్ కంటే 30 పాయింట్లు వెనుకబడింది.
4) 2016 బ్రెక్సిట్ రిఫరెండం బ్రిటీష్ రాజకీయాల్లో భారీగా గందరగోళానికి కారణమయ్యింది. ఏడేళ్లలోపు పార్టీకి ఐదవ ప్రధానమంత్రి రాబోతున్నాడు.
5) వారసుడిని ఎన్నుకునే ప్రక్రియను వారంలోగా పూర్తి చేస్తామని పదవీ విరమణ చేసిన ప్రధాని ప్రకటించారు.

6) ప్రధాని ఎన్నికలలో లిజ్ ట్రస్ చేతిలో ఓడిపోయిన రిషి సునక్ UK ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు వరుసలో ఉన్నారు.
7) స్కై బెట్ ప్రకారం, మాజీ ఆర్థిక మంత్రిగా ఉన్న సునా… ప్రస్తుతం 13/8 ఛాన్స్ కలిగి ఉన్నారు.
8) సునాక్ గెలిస్తే, UK ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి అవుతాడు.
9) పెన్నీ మోర్డాంట్, కెమి బాడెనోచ్ మరియు టామ్ తుగెన్‌ధాట్‌లతో సహా పోటీలో ఉండే అవకాశం ఉంది.
10) అక్టోబరు 19న ఉద్వాసనకు గురైన మాజీ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మన్ కూడా పోటీలో ఉండవచ్చు.

