Home Page SliderInternationalSports

రిషబ్ పంత్ ఇన్..కోహ్లి అవుట్

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, కోహ్లి టాప్ ర్యాంకులు తారుమారు అయ్యాయి. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌లలో రిషబ్ పంత్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంకు సాధించారు. టాప్ 10 లోకి దూసుకువచ్చాడు. రెండు అర్ధ సెంచరీలు చేయడంతో  ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి ఆరవస్థానం సాధించాడు. అయితే విరాట్ కోహ్లికి మాత్రం నిరాశ ఎదురయ్యింది. ఈ మొత్తం సిరీస్‌లో 93 పరుగులే చేసి, ఎనిమిది స్థానాలు దిగజారి టాప్ 20 ర్యాంకింగ్ నుండి పక్కకు తొలిగాడు. ప్రస్తుతం 22వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2014 నుండి టాప్ 20లో ఉన్న కోహ్లి పదేళ్ల అనంతరం ఆ స్థానాన్ని చేజార్చుకున్నారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 26వ స్థానానికి పడిపోయాడు. యశస్వి జైస్వాల్ 4వ స్థానంలో ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఆరోస్థానంలో, అశ్విన్ ఐదోస్థానంలో, బుమ్రా మూడవ స్థానంలో నిలిచారు.