Breaking NewsHome Page SliderInternationalSports

కోట్లు కొల్ల‌గొట్ట‌డంలోనూ రిష‌బ్ రికార్డు బ్రేక్‌

ఐపిఎల్‌ హిస్ట‌రీలోనే అత్యంత ఖ‌రీదైన ఆట‌గాడిగా టీం ఇండియా స్టార్ బ్యాట్స్ మెన్,వ‌ర‌ల్డ్ నం.3 వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ నిలిచాడు.ఒకానొక సమ‌యంలో యాక్సిడెంట్ కి గుర‌య్యి..ఇక జీవితం అంతా ముగిసిపోయింది రా దేవుడా అని బెడ్ కే ప‌రిమిత‌మైన రోజుల నుంచి ఐపిఎల్ ఆక్ష‌న్ బిడ్ హిస్ట‌రీలోనే అత్యంత ఖ‌రీదైన ఆట‌గాడి స్థాయికి చేరుకున్నారు.ఇలా చేర‌డం ఏమాత్రం ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు.ఆత్మ‌స్థైర్యం కావాలి,ఆట‌ను ప్రాణంగా భావించాలి. పీల్చి వ‌దిలే ఉచ్వాస నిచ్వాస‌ల్లోనూ క్రికెట్ ఉండాలి.అప్పుడే ఇలాంటి అద్భుతాల‌న్నీ జ‌రుగుతాయి. 2025 ఐపిఎల్‌ కోసం తాజాగా నిర్వ‌హిస్తున్న ఐపిఎల్ మెగా వేలంలో అనూహ్యంగా హై రిటైన‌ర్ గా రికార్డు సృష్టించాడు రిష‌బ్‌. రూ.2కోట్ల ప్రారంభ ధ‌ర‌తో వేలంలోకి వ‌చ్చిన ఈ యువ క్రికెట‌ర్‌… ఏకంగా రూ.27కోట్ల‌కు అమ్ముడు పోయాడు. ఆర్సీబి,హైద్రాబాద్‌,ల‌క్నో ల మ‌ధ్య నాట‌కీయ వేలం పాట‌ల మ‌ధ్య చివ‌ర‌గా లక్నో రిష‌బ్ ను ద‌క్కించుకుంది. ఇదే వేలంలో రూ.26.75కోట్ల‌కు పంజాబ్‌కు రిటైన్ అయిన శ్రేయాస్ అయ్య‌ర్ ని మించి రిష‌బ్ అద‌నంగా రూ.25ల‌క్ష‌లకు ల‌క్నోకి ద‌క్కాడు. మొత్తం మీద క్రికెట్ ని ఊపిరిగా భావించి జీవించే వాడి శ్వాస భ‌లే ఖ‌రీదు బాసు అన్న‌ట్లుగా రిష‌బ్ రికార్డు సృష్టించాడు.