Home Page SlidermoviesNational

ప్రభాస్ సినిమాకి కథ రాసిన కన్నడ హీరో..

‘హోంబలే ఫిల్మ్స్’ నిర్మాణ సంస్థ రెబల్ స్టార్ ప్రభాస్‌తో మూడు చిత్రాలు నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అందులో ఒక చిత్రానికి ప్రముఖ కన్నడ డైరక్టర్, హీరో రిషబ్ షెట్టి కథను అందించారని పేర్కొన్నారు. ‘కాంతార’ చిత్రంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన రిషబ్ షెట్టి ఇప్పటికే ‘జై హనుమాన్ చిత్రంతో మరోమారు మన ముందుకు రానున్నారు. ఇటీవలే ఆయన ‘ఛత్రపతి శివాజీ బయోపిక్‌లో కూడా నటించడానికి ఆమోదం తెలిపారు. శివాజీ తనకు ఆరాధ్య దైవం అని, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ చిత్రానికి ఒప్పుకున్నట్లు తెలిపారు. ప్రభాస్ కోసం రిషబ్ షెట్టి కథ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే హోంబలే ఫిల్మ్స్ ప్రభాస్‌తో ‘సలార్’ చిత్రాన్ని రూపొందించి, సక్సెస్ సాధించింది. ‘సలార్ 2’ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.  ఈ రెండు చిత్రాలకు ‘కేజీఎఫ్’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా మూడవ చిత్రానికి రిషబ్ షెట్టి కథను అందించారు. దర్శకుడెవరో ఇంకా ఖరారు కాలేదని నిర్మాణ సంస్థ పేర్కొంది.