ఎంపీతో రింకు పెళ్లి..
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ కు ఎంపీ ప్రియ సరోజ్ తో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మొదట ఈ ఇద్దరికీ ఎంగేజ్ మెంట్ జరిగిందనే ప్రచారం జోరుగా సాగింది. కానీ ప్రియ తండ్రి తుఫాని సరోజ్ దీన్ని ఖండించారు. రింకు కుటుంబ సభ్యులు పెళ్లి ప్రతిపాదన తెచ్చారని, ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అయితే.. యూపీలో మచ్చలి షహర్ నుంచి ఎంపీగా ప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల జనవరి నెలాఖరు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయన్నారు. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత నిశ్చితార్థం, వివాహ తేదీలను నిర్ణయించున్నట్లు తెలిపారు.