రైట్…రైట్…హైద్రాబాద్ 2 విజయవాడ రూ.99లకే!
ప్రజా రవాణాలో కీలకమైనవి బస్సులు.వీటిని ఆర్టీసి నడుపుతూ ఉంటుంది.అయితే తెలంగాణ ప్రభుత్వం సూత్రాప్రాయంగా ఎలక్ట్రికల్ వాహనాలకు అనుతిచ్చింది.గ్రీన్ ఎనర్జీ పేరుతో జంట నగరాల పరిధిలో చమురు ఇంధనంతో నడిచే వాహనాలకు చెక్ పెడతామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఓ ప్రైవేట్ సంస్థ ఎలక్ట్రికల్ బస్సును అందుబాటులో తెచ్చింది. దీన్ని హైద్రాబాద్ – విజయవాడ మధ్యలో నడపనున్నారు.ప్రయాణ టికెట్ ధర కేవలం రూ.99లుగా నిర్ణయించారు. మూడు నాలుగు వారాల్లోపే ఈ బస్సుని ప్రయాణీకుల మధ్యకు తీసుకొస్తామని ఈటీవో మోటార్స్ సీఎంవో వైఎస్ఆర్ రాజీవ్, ప్లిక్స్ బస్ ఇండియా ఎండీ సూర్య ఖురానా వెల్లడించారు.