Andhra PradeshHome Page Slider

ఆర్జీవీ సంచలన ట్వీట్..’జనసేనను చంద్రసేనగా మార్చాలి’

తాను అద్భుతమైన ఐడియా ఇస్తున్నానని, జనసేన పేరును చంద్రసేనగా మార్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందని సంచలన దర్శకుడు ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తరచూ తలదూర్చే అలవాటు రామ్ గోపాల్ వర్మకు మొదటి నుండీ ఉంది. ముఖ్యమంత్రి జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాత్రదారులతో ఈ మధ్యనే ‘వ్యూహం’ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. జగన్‌ను కథానాయకుడిగా, చంద్రబాబును ప్రతినాయకుడిగా ఆ చిత్రంలో చూపిస్తున్నట్లు ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. తెలుగదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. నేటి యువగళం విజయోత్సవ సభకు పవన్ కళ్యాణ్ హాజరవుతుండడంతో ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారని తెలుస్తోంది. ఈ పార్టీలపై, వ్యక్తులపై తరచూ సెటైర్లు వేస్తూ ట్వీట్లు చేస్తూ ఉంటారు వర్మ.