NationalNewsTrending Today

సల్మాన్‌-బిష్ణోయ్ వ్యవహారంపై ఆర్జీవీ సంచలన ట్వీట్

బాలీవుడ్ నటుడ్ సల్మాన్‌ఖాన్‌ను హత్యచేయడానికి లారెన్స్ బిష్ణోయ్ కుట్ర చేయడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 1998లో సల్మాన్‌ఖాన్ కృష్ణజింకను వేటాడిన కారణంగా పగ పెంచుకున్న లారెన్స్ అప్పటికి ఐదేళ్ల పిల్లవాడు. అప్పడి నుండి పగతో 700 మందితో గ్యాంగ్ తయారు చేయడం చాలా వింతగా ఉంది. అంటూ పేర్కొన్నారు. ఇది జంతువులపై వారికి ఉన్న ప్రేమా లేక భగవంతుడు ఆడుతున్న వింత నాటకమా అంటూ ప్రశ్నించారు. పోలీసులు కూడా అతడిని అడ్డుకోలేరని, ఇప్పటికే హై సెక్యూరిటీ ఉన్న జైలులో ఉన్నా సెల్‌ఫోన్ల ద్వారా అనుచరులతో టచ్‌లో ఉంటాడని పేరుంది. దీనికి అధికారులు, ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయా అంటూ ప్రశ్నించారు.