NewsTelangana

తెలంగాణా సర్కార్‌పై RGV సెటైర్లు

 కాంట్రవర్సీకి కెరాఫ్ అడ్రస్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాజాగా తెలంగాణా సర్కార్‌పై ఓ ట్వీట్ చేశారు. అదేంటంటే తెలంగాణా ప్రభుత్వం ఇటీవల కాలంలో నగరంలోని పబ్‌లపై  ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో రాత్రి 10 గంటల తర్వాత పబ్ సౌండ్స్ వినిపించడం లేదన్నారు. ఈ మేరకు రామ్‌గోపాల్ వర్మ పబ్‌లను స్మశానవాటికలతో పోల్చారు. హైదరాబాద్‌లో తాలిబన్ స్టైల్ పాలన నడుస్తుందని ఆయన ఆరోపించారు. ఈ ట్వీట్‌తో రామ్‌గోపాల్ వర్మ రాష్ట్ర వ్యాప్తంగా మరో వివాదానికి తెర తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ట్వీట్ తెలంగాణా రాజకీయాలలో తీవ్ర దుమారం రేపుతుంది. ఇప్పటికే మునుగోడు ఉపఎన్నికల ప్రచారాలలో భాగంగా సీఎం కేసీఆర్‌పై ప్రత్యర్థి పార్టీలు విమర్శల జల్లు కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్‌గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ ప్రత్యర్థులకు తెలంగాణా సర్కార్‌ను వేలు ఎత్తి చూపడానికి చక్కగా ఉపయోగపడుతుందనే చెప్పాలి.