పోలీసు విచారణకు ఆర్జీవీ డుమ్మా
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, పవన్, లోకేశ్‌లపై అనుచిత పోస్టులు పెట్టారంటూ మద్దిపాడులో ఆయనపై కేసు నమోదైన నేపథ్యంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ విచారణలో భాగంగా ఆయనను విచారణకు రావాలని పేర్కొన్నారు. అయితే తనకు నాలుగు రోజుల సమయం కావాలని, వాట్సాప్‌లో సమాచారం పంపారు రామ్ గోపాల్ వర్మ. నేడు ఒంగోలు సీఐ కార్యాలయానికి విచారణకు రావలసి ఉండగా, డుమ్మా కొట్టారు.


 
							 
							