ఏపీ విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు: మంత్రి బొత్స
ఇవాళ ఏపీలో వరుసగా నాల్గవ ఏడాది జగనన్న విద్యా కానుక కిట్లు విద్యార్థులకు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ పల్నాడు జిల్లా క్రోసూర్ ప్రారంభించారు. 2023-24 విద్యా సంవత్సరానికి జగనన్న విద్యాకానుక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకుచదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు.కాగా ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌తోపాటు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా క్రోసూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..దేశంలోనే మన రాష్ట్రంలో విద్యా కీలకంగా సంస్కరణలు చేశామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రతి విద్యార్ధి ఉన్నతస్థాయిలో నిలబడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ లో విద్యా బోధన అందిస్తున్నామని అన్నారు.అనంతరం సీఎం జగన్‌తో కలిసి ఆయన విద్యార్థులకు జగనన్న కిట్లు పంపిణీ చేశారు.