Home Page SliderTelangana

ముత్యాలమ్మ ఆలయంలో పునఃప్రతిష్ట

సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసిన ఘటనపై ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం పునఃప్రతిష్ట చేస్తామని తలసాని హామీ ఇచ్చారు. కుంభాభిషేకం కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. పూజారులు, పండితుల నిర్ణయం మేరకు శాంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలు మూడు రోజుల పాటు నిర్వహించి, విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయిస్తామని పేర్కొన్నారు.