రేవంత్ తల్లి వర్సెస్ కేసిఆర్ తల్లి
తెలంగాణకు ఇప్పుడు ఇద్దరు తల్లులు ఉండబోతున్నారు.ఒకరు కేసిఆర్ సృష్టించిన తెలంగాణా తల్లి….ఇంకొకరు రేవంత్ రెడ్డి తయారు చేసిన తెలంగాణ తల్లి.కేసిఆర్ వారి తెలంగాణ తల్లి అలంకరీకృతంగా ఉండగా…రేవంత్ వారి తల్లి అత్యంత సాదా సీదాగా ఉన్నారు. ఈ మేరకు సచివాలయంలో త్వరలో ఏర్పాటు చేయనున్న రేవంత్ వారి తెలంగాణ తల్లి నమూనా చిత్రపటాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. కొత్త తల్లి ఎడమ చేతిలో వరి,మొక్కజొన్న,సజ్జ కంకులు,చేతులకు గాజులు,ఆకుపచ్చ చీర,బంగారు వర్ణం ఆంచు, మెడలో కంటే ఉండేలా రూపుదిద్దారు.ఫౌంటేయిన్ కూడా ఏర్పాటు చేయనున్నారు.ఎన్టీఆర్ మార్గ్,ట్యాంక్ బండ్ మీదుగా చూసినా కనిపించేలా ఈనెల9న సచివాలయంలో ఏర్పాటు చేయనున్నారు.ఇంతకీ ఏ పార్టీ వాళ్లు వాళ్ల తల్లిని పూజించుకోవాలా…లేదా అందరూ కలిసి ఒకే తల్లిని కొలవాలా అన్న సందేహంలో తెలంగాణ ప్రజలున్నారు.

