‘రేవంతే బీజేపీని గెలిపిస్తున్నాడు’..కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ అడుగుపెడితే అక్కడ బీజేపీ గెలుస్తోందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రతీ ఎన్నికలో రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్లిన చోటే ఓడిపోతోందని, రేవంతే బీజేపీని గెలిపిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ ఎన్నికల ప్రచార బాధ్యతలు తీసుకున్న మహబూబ్ నగర్, మల్కాజిగిరి నియోజకవర్గాలు లోక్ సభ ఎన్నికలలో ఓడిపోతే, హిమాచల్, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిందన్నారు. అలాగే తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి బీజేపీని గెలిపించిందని వ్యాఖ్యానించారు. ఈ లోగుట్టు ఏమిటో బడే భాయ్‌కి, ఛోటా భాయ్‌కే తెలియాలని ఎద్దేవా చేశారు.


 
							 
							