‘రేవంత్‌కి వారి ఉసురు తగులుతుంది’..కేటీఆర్
లగచర్ల కేసులో అరెస్టు అయి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న 16 మందితో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. అన్యాయంగా జైల్లో వేసిన వారి కుటుంబాల ఉసురు రేవంత్ రెడ్డికి తగులుతుందని విమర్శించారు. “లగచర్ల దాడి జరిగిన అనంతరం కాంగ్రెస్ వారిని వదిలేసి, బీఆర్‌ఎస్‌కు సంబంధించిన వారిని మాత్రమే అరెస్టు చేశారు. థర్డ్ డిగ్రీ చిత్రహింసలు పెట్టారు. రేవంత్ రెడ్డి చేతకానితనాన్ని ప్రదర్శిస్తున్నారు. అందుకే కేసులు పెడుతున్నారు. సీఎం పదవి ఐదేళ్లే. అది కూడా ఢిల్లీ వాళ్లకి కోపం వస్తే చాలు సీఎంని మార్చేస్తారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏం చెయ్యాలో మాకు తెలుసు. మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం” అని వారికి హామీ ఇచ్చారు.

