మరోసారి ఢిల్లీకి రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసి పంపిస్తామని.. రిజర్వేషన్ల అమలుకు కేంద్రం సహకరించాలని మోడీని కోరనున్నారు. సీఎం రేవంత్ పలువురు కేంద్ర మంత్రులను సైతం కలవనున్నారని సమాచారం. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కూడా కలిసే అవకాశముంది. మంత్రివర్గ విస్తరణతోపాటు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై అధిష్టానం పెద్దలతో చర్చిస్తారని సమాచారం.