సోయి లేకుండా మాట్లాడుతున్న రేవంత్
సీఎం అయ్యాక కూడా మాపై ఎందుకింత ఫ్రస్ట్రేషన్, కేసిఆర్ ఏం తప్పు చేసిండు…అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటిఆర్ ధ్వజమెత్తారు. ఆదానితో సీఎం రేవంత్ సర్కార్ చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని కోరితే…తమపైనే బురదజల్లుతున్నారని మండిపడ్డారు.కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే జాతీయ ప్రాజెక్టులు కూడా రాష్ట్ర పరిధిలోకి వస్తాయా….ఏమైనా సోయి ఉండి మాట్లాడుతున్నవా..అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.దొంగే దొంగ అని గట్టిగా అరిచినట్లుమాట్లాడితే ప్రజలు నమ్ముతారని రేవంత్ భ్రమలో ఉన్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఓ వైపు ఆదానిని దొంగ అని గొంతెత్తి విమర్శిస్తుంటే…ఇక్కడున్న సీఎం ఆదానితో దోస్తానా ఏందని తాము ప్రశ్నిస్తే తప్పనిపించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించకపోతే రేవంత్ సర్కార్ కి తగిన బుద్ది చెబుతామని కేటిఆర్ హెచ్చరించారు.