Home Page SliderTelangana

“మీ మామలాగే సిగ్గు లేకపోతే ఏట్ల దూకి చావు”…రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

వైరా సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని సగర్వంగా చెప్తున్నానని పేర్కొన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేసిన హరీశ్ రావు సిగ్గు, అభిమానం ఉంటే వెంటనే రాజీనామా చేయాలన్నారు. లేకపోతే మీ మామలాగే ఏట్ల దూకి చావు అంటూ ఘాటుగా విమర్శించారు. ఈ రోజు మరోసారి తాను సవాల్ చేస్తున్నానని రాజీనామా చేయలేకపోతే అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ముక్కు నేలకు రాసి, రైతులకు హరీశ్ రావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.