“రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరి బయటపడింది”: హరీశ్‌రావు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుతెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.పీఎం ఫసల్ బీమా యోజన పథకానికి..రాష్ట్ర బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు. కాగా ఈ పథకాన్ని జైరామ్ రమేష్ విమర్శించారని తెలిపారు.ఒకవైపు బీజేపీ అదానీకి దోచి పెడుతోందని రాహుల్ అంటారు. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదానీతో ఒప్పందాలు చేసుకుంటోందని ఆయన విమర్శించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు.