అల్లు అర్జున్ అరెస్టు విషయంలో రేవంత్ రెడ్డి క్లారిటీ..
అల్లు అర్జున్ అరెస్టు విషయంలో తనకేమీ సంబంధం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చట్టం తనపని తాను చేసుకుపోతుందని, తన ప్రమేయం ఏదీ లేదని ఆయన పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ట్విటర్ పోస్టులో ఈ అరెస్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించారు. తొక్కిసలాట వల్ల చనిపోయిన వ్యక్తి మరణంపై అల్లు అర్జున్‌కు బాధ్యత ఉంటే, హైడ్రా వల్ల చనిపోయిన వారి విషయంలో రేవంత్ రెడ్డికి బాధ్యత ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి ఈ అరెస్టు విషయంలో తన జోక్యం లేదని క్లారిటీ ఇచ్చారు.