Home Page SliderTelangana

కేసీఆర్‌కు పగ ఉంటే రేవంత్ రెడ్డి జైల్లో ఉండేవాడు: హరీశ్ రావు

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాగా రాష్ట్రంలో వచ్చే నెల 30వ తేదిన ఎన్నికలు జరగనున్నాయి.ఈ మేరకు రాష్ట్రంలోని పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాలను జోరుగా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మంత్రి హరీశ్‌రావు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఈ రోజు చెరుకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి  అభ్యర్థులే లేరని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ అన్నీ అబద్దాలే ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.  కాగా రాహుల్ గాంధీ..రాంగ్ గాంధీ అని పేరు మార్చుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణాలో పనితనమే తప్ప పగతనం లేని నాయకుడు కేసీఆర్ అని హరీశ్ రావు స్పష్టం చేశారు. అయితే నిజంగా కేసీఆర్‌కు పగ ఉంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఎప్పుడో జైల్లో ఉండేవాడని హరీశ్ రావు వెల్లడించారు.