Home Page SliderTelangana

కామారెడ్డిలో కేసీఆర్‌ను ఢీకొట్టనున్న రేవంత్ రెడ్డి

కామారెడ్డిలో పోటీపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టాలని రేవంత్ నిర్ణయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించింది. కామారెడ్డిలో ఈనెల 8న నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఈనెల 6న కొడంగల్‌లో రేవంత్ నామినేషన్ వేయనున్నారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్ నాయకత్వ ఒక వ్యక్తికి రెండు చోట్ల పోటీ చేసే అవకాశం ఇవ్వడం కూడా సంచలనమని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీకి అభ్యర్థిత్వం ఖరారయ్యింది. తాజాగా కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు కామారెడ్డికి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి బరిలో దిగనున్నారు. రేపు నిజామాబాద్ అర్బన్ నాయకులతో రేపు షబ్బీర్ అలీ నిర్వహించబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతివ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావు ఠాక్రే నేతలకు సూచించారు.