Home Page SliderTelangana

రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు ఆపితే మంచిది: గుత్తా

రేవంత్ రెడ్డి ఇటీవల ఉచిత కరెంటుపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణాలో తీవ్ర దుమారం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు,నేతలు రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ..తెలంగాణా వ్యాప్తంగా ఆందోళనలు కూడా చేపట్టారు. అయితే ఈ వ్యాఖ్యలపై తెలంగాణా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ మండిపడ్డారు. కాగా ఆయన మాట్లాడుతూ..టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవసాయంలో కనీసం ABCDలు కూడా రావని ఎద్దేవా చేశారు. అయితే బషీర్‌బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణం అనడం సరికాదన్నారు. అంతేకాకుండా రేవంత్ కేసీఆర్ ప్రభుత్వం కరెంటు కొనుగోలులో అవినీతికి పాల్పడిందనడం కూడా అవివేకమని గుత్తా తెలిపారు. కాగా రేవంత్ విద్యుత్‌పై అసత్య ప్రచారాం మానుకోవాలని గుత్తా సూచించారు. ఇవన్నీ మాట్లాడే ముందు తెలంగాణాలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో చెప్పాలని గుత్తా సుఖేందర్ రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.