ICRISAT డైరెక్టర్‌తో రేవంత్ రెడ్డి భేటీ
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ICRISAT డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ ( Dr. Jacqueline Hughe) మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి ఉపయోగపడేలా పరిశోధనలు ఉండాలని సీఎం సూచించారు. వివిధ రకాల పంటలకు సంబంధించి అధిక దిగుబడిని అందించే కొత్త వంగడాలపై పరిశోధనలు చేయాలని జాక్వెలిన్‌ను కోరారు రేవంత్‌రెడ్డి. ICRISAT ను సందర్శించాలని జాక్వెలిన్ కోరారు. తప్పకుండా వస్తానని పేర్కొన్నారు ముఖ్యమంత్రి.

