Home Page SliderTelangana

మోదీకి రేవంత్ రెడ్డి కౌంటర్

ఇష్టమొచ్చినట్లుగా ఎన్నికల హామీలివ్వొద్దంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ప్రధాని మోదీ ఈ విషయంపై వరుస ట్వీట్లు చేశారు. బూటకపు హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని, అందుకే ఈ సారి ఓట్లు రావని గ్రహించి, ఖర్గే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మోదీ ధ్వజమెత్తారు. ప్రధాని విమర్శలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటోందని బదులిచ్చారు. అధికారంలోకి వచ్చిన కేవలం రెండురోజులలోనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించామని, ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షలకు పెంచామన్నారు. దేశంలోనే అతి పెద్ద రుణమాఫీని అమలు చేస్తున్నాం అని, 200 యూనిట్ల ఉచిత కరెంట్ సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. అలాగే రూ.500లకే గ్యాస్ సిలిండర్, గ్రూప్స్ ఉద్యోగ నియామకాలు, మూసీ పునరుజ్జీవనం, స్కిల్ వర్సిటీ, ఫ్యూచర్ సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి అంశాలను ప్రస్తావించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే మెరుగైన స్థితిలో ఉన్నామని ఈ ట్వీట్స్ చేశారు రేవంత్ రెడ్డి.