Home Page SliderTelangana

రేవంత్ రెడ్డి చేస్తున్నది కరెక్ట్: అన్వేష్

HCU వివాదంపై యూట్యూబర్ అన్వేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నది ముమ్మాటికి కరెక్ట్ అని తేల్చి చెప్పారు. 400 ఎకరాల ద్వారా.. ప్రజల కోసం రూ. 50 వేల కోట్ల సంపదను రేవంత్ రెడ్డి సృష్టిస్తున్నారని అని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని, ఈ డబ్బుతో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్వేష్ తెలిపారు. తన కోసం ఏమీ చేయడం లేదు.. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు.