Home Page SliderTelangana

ISBలో రేవంత్ రెడ్డి..ఏమన్నారంటే?

హైదరాబాద్ ఐఎస్‌బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్)లో నిర్వహించిన లీడర్ షిప్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. త్యాగాలు చేయకుండా గొప్ప నాయకులు కాలేరని ఆయన తేల్చి చెప్పారు. రిస్క్ లేకుండా గొప్ప విజయాలు సొంతం కావని, ధైర్యం, త్యాగం ఉన్నవారే గొప్ప నాయకులుగా మారతారని పేర్కొన్నారు. తాను గాంధీ, నెహ్రూ, ఇందిర వంటి గొప్ప నాయకులను ఆదర్శంగా తీసుకుని నాయకత్వ లక్షణాలను నేర్చుకున్నానని పేర్కొన్నారు. ఐఎస్‌బీ విద్యార్థులు తెలంగాణకు, దేశానికి బ్రాండ్ అంబాసిడర్లని, హైదరాబాద్‌ను 600 మిలియన్ల సిటీగా మార్చేందుకు మీ సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. మీరంతా తెలంగాణలో మూడేళ్లు పనిచేయాలి. ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల తరహాలో జీతాలు ఇవ్వలేకపోయినా అవకాశాలు కల్పిస్తుందని హామీ ఇచ్చారు.