Home Page SliderTelanganatelangana,

విద్యార్థులతో అసెంబ్లీ నిర్వహించిన రేవంత్ రెడ్డి..ఫోటోలు వైరల్

హైదరాబాద్‌లోని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి అసెంబ్లీ నిర్వహించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. బాలల దినోత్సవం సందర్భంగా అండర్ 18 మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులతో కలిసి ఇలా మాక్ అసెంబ్లీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులలో పరిపాలనా వ్యవహారాలపై అవగాహన ఏర్పడుతుందని పేర్కొన్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడు ఇద్దరికీ సమాన అవకాశాలు ఉంటాయన్నారు. స్పీకర్‌పై సభను సమర్థవంతంగా నడిపే బాధ్యత వహిస్తారని, ఇతర సభ్యులు ప్రభుత్వ బిల్లులపై చర్చలు, ప్రశ్నలతో నిలదీస్తారని పేర్కొన్నారు.