Home Page SliderTelangana

చిత్తకార్తె కుక్కల్లా తిరుగుతున్నారు బిల్లా,రంగాలు-రేవంత్ రెడ్డి

తెలంగాణాలో చిత్తకార్తె కుక్కల్లా తిరుగుతున్నారు బిల్లారంగాలు అంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి. బిల్లా రంగాలంటే ఎవరో కాదని, కేటీఆర్-హరీష్ రావులేనని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎందుకు ఓటెయ్యాలంటూ అరుస్తున్నారన్నారు. ఎందుకు ఓటెయ్యాలంటే 2004లో రైతులకు కరెంట్ ఇచ్చిందని, జలయజ్ఞం చేసిందని, ఉపాధి హామీ పథకాలను, ఆహార భద్రతను కల్పించిందని అందుకే కాంగ్రెస్‌కు ఓటు వేయాలన్నారు. హైదరాబాద్‌లో, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, మెట్రోట్రైన్లను, ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ 60 ఏళ్లకలను నెరవేర్చేలా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు.  అంతే కాదని ఎక్కడో వీధుల్లో తిరుగుతున్న హరీష్ రావును ఎమ్మెల్యేను కాకముందే మంత్రిని చేసిందని, ఎక్కడో దుబాయ్‌లో పాస్‌పోర్ట్ బ్రోకర్‌గా ఉన్న చంద్రశేఖర్ రావును పిలిచి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా చేసిందన్నారు. అంతేకాదు నీ అయ్య కేసీఆర్ మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిక్ష అని, సోనియా గాంధీ గారి దయ అని ఎద్దేవా చేశారు. ఎక్కడో అమెరికాలో ఉన్న కేటీఆర్ నేడు తెలంగాణాలో మంత్రి అయి ఒయ్యారాలు ఒలక పోస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ పెట్టిన బిక్షతోనే మీరు మీ పార్టీ అధికారం అనుభవిస్తున్నారన్నారు.