Breaking NewsHome Page SliderPolitics

దొంగ‌తో దోస్తీ క‌డుతున్న రేవంత్‌

ఆదాని ఇచ్చిన ముడుపుల్లో ఎవ‌రి వాటా ఎంతో తేలాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మాజీ మంత్రి కేటిఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ఓ వైపు ఆదానిని దొంగ‌గా పోలుస్తుంటే…ఇక్క‌డ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ దొంగ ఆదానీతో దోస్తానా చేస్తున్నాడంటూ మండిప‌డుతున్నారు.మేక‌పోతు గాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్న రాహుల్ గాంధీ వాటా కూడా ఎంతో తేల్చాల‌ని కేటిఆర్ కోరారు. రేవంత్ రెడ్డి కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల్లో ఎవరి వాటా ఎంతని సూటిగా ప్ర‌శ్నించారు. కేసీఆర్‌ పదేళ్ల‌లో సృష్టించిన తెలంగాణ సంపదను క్రోనీ క్యాపిటలిస్టులు దోచుకునేలా జట్టు కడతారా? అని నిల‌దీశారు. అంతే కాదు…రేవంత్‌ సర్కార్‌ అదానీతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అదానీ దోస్త్‌ రేవంత్‌పై రాహుల్‌ గాంధీ చర్య తీసుకోవాలని కోరారు.తెలంగాణలో అదానీ పెట్టుబడులపై బీజేపీ వైఖరేంటో స్ప‌ష్టం చేయాల‌న్నారు.మొత్తం మీద అమెరికాలో ఆదాని కుటుంబీకుల‌పై న‌మోదైన కేసుల వ్య‌వ‌హారంతో తెలంగాణ బీజెపి, రేవంత్ స‌ర్కార్ ప‌ని కుడితిలో ప‌డిన ఎలుక‌లా మారింద‌నే సెటైర్లు వినిపిస్తున్నాయి.