Home Page SliderTelangana

రేవంత్ అన్న అనగానే పరుగెత్తుకొచ్చిన సీఎం

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తెలంగాణా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఔరా అనిపిస్తున్నారు. కాగా తెలంగాణా మాజీ సీఎం కేసీఆర్ తన నివాసంలో జారిపడిపోవడంతో ఆయనకు యశోద హాస్పటల్‌లో సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్‌ను హాస్పటల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు.అయితే ఆయన యశోద హాస్పటల్‌ నుంచి తిరిగి వెళ్తున్న సందర్భంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అదేంటంటే ఓ మహిళ రేవంత్ అన్నా మీతో మాట్లాడాలి అని సీఎంని పిలిచారు.దీనికి స్పందించిన సీఎం వెంటనే ఆమె వద్దకు వెళ్లి ఏమైందని అడిగారు. ఆమె తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదని,ఒక్క రోజు రూ.1.50 లక్షలు తీసుకుంటున్నారంటూ ఆయన కాళ్లపై పడ్డారు. దీంతో సీఎం రేవంత్ పేషంట్ వివరాలు తెలుసుకొని “సార్ కొంచెం చూడండి” అంటూ హాస్పటల్ అధికారులకు సూచించారు.కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.