లగచర్ల బాధితులు ఆందోళన చేస్తుంటే రేవంత్ జల్సా చేస్తున్నాడు
గడచిన 9 నెలల నుంచి లగచర్ల రైతులు భూమి కోసం పోరాటం చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి కనీసం వారితో మాట్లాడేందుకు కూడా సుముఖంగా లేకపోవడం దౌర్భాగ్యమని మాజీ మంత్రి బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆరోపించారు.మహాబూబాబాద్ లో సోమవారం నిర్వహించిన మహాధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రేవంత్‌కు ఢిల్లీకి వెళ్లడానికి సమయం ఉంటుంది గానీ సొంత నియోజకవర్గంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలు తీర్చేందుకు సమయం ఉండటం లేదా అని ప్రశ్నించారు. తన పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్ల దాడి చేస్తామని బెదిరిస్తున్నారని,అలాంటివారికి మానుకోటే నిదర్శనమని హెచ్చరించారు.మానుకోట నుంచి రాళ్లదాడి పుడితే ఆ రాళ్ల దాడి నుంచి తెలంగాణ పుట్టిందనే సంగతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలన్నారు. కాగా సభ జరుగుతున్నంత సేపు అభిమానులు,బీఆర్ ఎస్ శ్రేణులు సీఎం..సీఎం అంటూ నినదించడం విశేషం.