Home Page SliderTelangana

అబద్దాలు చెప్పడం, డబ్బిచ్చి చెప్పించడం రేవంత్‌కు అలవాటే..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. రేవంత్ రెడ్డికి అబద్దాలు చెప్పడం, డబ్బిచ్చి అబద్దాలు చెప్పించడం అలవాటే అన్నారు. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహ ప్రాంతానికి రమ్మని చెప్పండి. 30 ఏళ్లు, 40 ఏళ్ల క్రితం నుండి ఉన్న నివాసం ఉన్నవారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని మండిపడ్డారు. పేదలను భయపెట్టి ఖాళీ చేయిస్తున్నట్లు నిరూపిస్తానని, శభాష్ రేవంత్ రెడ్డి అని అక్కడ ఎవరైనా అంటే తాను రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ చేశారు. హుస్సేన్ సాగర్‌ను కొబ్బరినీళ్లతో నింపుతా, మూసీ నదిని జీవనదిగా మారుస్తా అని గొప్పలు చెప్పిన కేసీఆర్ ఏం చేయలేకపోయాడు. ఇక రేవంత్ రెడ్డి ఏం చేయలేక ఇళ్లు ఖాళీ చేయిస్తున్నాడని విమర్శించారు. దమ్ముంటే మూసీ నీటిని పరిశుభ్రంగా మార్చమని సవాల్ చేశారు ఈటల రాజేందర్.

ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు చెప్పిన మాటలే తర్వాత రోజు జిరాక్స్ కాపీలు తీసుకుని మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీరు పదేళ్లు బీఆర్‌ఎస్ పార్టీతో అంటకాగి వారి లక్షణాలు అలవర్చుకున్నారని రేవంత్ మాటలపై ఈ టల మండి పడ్డారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ వ్యాఖ్యలకు జవాబు చెప్పారు.