గల్ఫ్ కార్మికుల కోసం రేవంత్ భరోసా..
తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల కోసం కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది. కార్మికుల సాంఘిక భద్రత, సంక్షేమం, గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లింపు గురించి మినీ డాక్యుమెంటరీ నిర్మించారు. దీనిని ప్రవాసీ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు విడుదల చేశారు. ఈ చిత్రబృందం తెలంగాణలోని పలు గ్రామాలలో పర్యటించి గల్ఫ్ మృతుల కుటుంబాలను, కొందరు ప్రవాసీ కార్మికుల అభిప్రాయాలను సేకరించారు. ఈ డాక్యుమెంటరీకి రేవంత్ సర్కార్- గల్ఫ్ భరోసా అనే పేరుతో రిలీజ్ చేశారు.