కేటిఆర్‌పై రేవంత్ బామ్మర్ధి పరువు నష్టం దావా
అమృత్ పథకం టెండర్లను నిబంధనలకు విరుద్దంగా సీఎం రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డికి కట్టబెట్టారని మాజీ మంత్రి కేటిఆర్ ఆరోపించిన సంగతి తెలిసిందే.దీంతో సృజన్ రెడ్డి …కేటిఆర్ పై నాంపల్లి హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు.అంతే కాదు …ఈ వ్యవహారంలో కేటిఆర్ కేంద్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా కంప్లెయింట్ కూడా చేశారు.పలువురు కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణలో నిబంధనలకు విరుద్దంగా ఇచ్చిన అమృత్ టెండర్లను రద్దు చేయాలని విజ్క్షప్తి చేశారు.ఈ నేపథ్యంలో తమ పరువుకి భంగం కలిగించేలా వ్యాఖ్యానించారని అభిప్రాయపడుతూ సృజన్ రెడ్డి కోర్టుని ఆశ్రయించారు.