ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయానికి రేవంత్ సెగ
దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం వద్ద రైతు భరోసా పోస్టర్ల కలకలం రేగింది. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి వరంగల్ డిక్లరేషన్ పేరు తో తెలంగాణ రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు చొప్పున ఇస్తామని ప్రకటించి, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత 2024వ సంవత్సరంలో రైతులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం ఏంటని ప్రశ్నిస్తూ ఈ పోస్టర్లు వెలిశాయి. ఇటీవల సీఎం రేవంత్ యూటర్న్ తీసుకుంటూ ఎకరాకు 15,000 ఇవ్వమని ప్రకటించడంపై ఏకంగా ఏఐసీసీ కాంగ్రెస్ కార్యాలయం వద్ద “కాంగ్రెస్ రైతు భరోసా యూటర్న్” పేరుతో పోస్టర్లు వెలిశాయి.రాత్రికి రాత్రి ఈ పోస్టర్లను ఎవరు,ఎలా అతికించారంటూ ఉదయాన్నే కార్యాలయానికి వచ్చిన నేతలంతా తలలు పట్టుకుంటున్నారు.ఒక వైపు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాజిటివ్ వేవ్స్ వస్తుంటే…తమకీ తెలంగాణీ రేవంత్ గోలేటంటూ పంజాబ్,హర్యానా రాష్ట్రాల కాంగ్రేసీయులు గగ్గోలు పెడుతున్నారట.