Home Page SliderTelangana

వారికి రుణమాఫీ చేయలేమన్న రేవంత్ సర్కార్

తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాగా రాష్ట్రంలో త్వరలోనే రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణా మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు రుణమాఫీ వర్తింపజేయొద్దని సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే రుణమాఫీలో ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా తెలంగాణాలో రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇందులో రూ.10 వేల కోట్లను ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇంకో  రూ.10 వేల కోట్ల కోసం ప్రభుత్వం TGICC భూములను తనఖా పెట్టనుంది. కాగా మిగతా రూ.11 కోట్లను రుణాల రూపంలో సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.