Home Page SliderTelangana

రిటైర్డ్ ఉద్యోగి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపు

జమ్మికుంట: రిటైర్డ్ ఉద్యోగి, జమ్మికుంట మండల వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన కేఆర్ నాగరాజు వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నిజామాబాద్ సీపీగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఆయన.. బీఆర్ఎస్ అభ్యర్థిపై 19 వేలకు పైగా ఓట్లతో గెలుపొందారు.

నాగరాజు స్పోర్ట్స్ కోటాలో పోలీసు శాఖలో ఉద్యోగం సాధించారు. రాజకీయ అనుభవం ఏమీ లేదు.. పరకాల ఎస్సైగా.. హన్మకొండ, కాజీపేట సీఐగా, జనగాం డీఎస్పీగా, హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీగా పనిచేశారు. నిజామాబాద్ సీపీగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. నాగరాజు ఫౌండేషన్ పేరిట పలు సేవా కార్యక్రమాలు చేశారు. కొన్ని నెలల క్రితమే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న నాగరాజు.. అందివచ్చిన అవకాశంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు.