వైరల్ అవుతున్న టెక్ దిగ్గజాల రెజ్యూమ్స్ ..
మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్, యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్‌జాబ్స్ అంటే తెలియనివారుండరు. ఈ టెక్ దిగ్గజాల రెజ్యూమెలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కంప్యూటర్ సాంకేతికత మొదలైన తొలినాళ్లలో వారి రెజ్యూమ్‌లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. వారి 18 ఏళ్ల వయసులో ఉద్యోగం కోసం రూపొందించిన ఈ బయోడేటాలలో అప్పటి విభాగాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.
బిల్‌గేట్స్ 1970లోనూ, స్టీవ్‌జాబ్స్ 1973లోనూ రూపొందించిన రెజ్యూమెలలో వారు పొందుపరచిన అంశాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. బిల్‌గేట్స్ 1970లో తనకు వివిధ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లలో అనుభవం ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ అప్పటి తన జీతం 35వేల డాలర్లని తెలిపారు. ఒక విద్యార్థికి ఇంత జీతం ఆరోజుల్లో రావడం చాలా గొప్పతనం. ఈ రెజ్యూమ్‌లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ జి అలెన్‌తో భాగస్వామిగా ఉన్న సంగతిని కూడా ప్రస్తావించారు. 1973లో చేతి రాతతో తన రెజ్యూమెను తయారు చేశారు స్టీవ్‌జాబ్స్. ఐఫోన్ ఉత్పత్తుల రూపకల్పనకు నాయకత్వం వహించి, ప్రపంచంలోనే అతి విలువైన కంపెనీగా యాపిల్‌ను నిలబెట్టారు స్టీవ్‌జాబ్స్.


