ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఫలితాలు..
కాంగ్రెస్ అభ్యర్థులు మానకొండూరు- కవ్వంపల్లి సత్యనారాయణ గెలుపొందారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై ప్రతిసారి ముందంజలోనే ఉన్నారు.
చొప్పదండి -మేడిపల్లి సత్యం కూడా ప్రతీ రౌండ్ లోనూ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌పై ఆధిపత్యం చూపించారు.
హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి తమ ప్రత్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి ఒడితల ప్రణవ్‌పై స్పష్టమైన ఆధిపత్యంతో గెలుపొందారు.
పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మంథని – శ్రీధర్‌బాబు, రామగుండం- మక్కాన్ సింగ్, పెద్దపల్లి -విజయ రమణారావు నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో క్లీన్‌స్వీప్ చేసింది. ఇందులో ఠాకూర్ మక్కాన్ సింగ్ మూడోసారి పోటీ చేయడం, రామగుండంలో కాంగ్రెస్‌కు వచ్చిన అనూహ్య ఆదరణ, స్థానికంగా సానుభూతి పనిచేశాయి.
సిరిసిల్లలో కేటీఆర్ (బీఆర్ఎస్) సునాయాస విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తన చిరకాల ప్రత్యర్థి కేకే మహేందర్‌రెడ్డిని ఐదోసారి ఓడించారు. 2009 నుండి వీరిద్దరూ పోటీపడటం ఐదోసారి కావడం విశేషం. కాంగ్రెస్ హవా, సానుభూతి పనిచేయలేదు.
వేములవాడలో ఊహించినట్లుగానే ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్) విజయం సాధించారు. ప్రజల దీవెనతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెడ లక్ష్మీనరసింహారావు, బీజేపీ అభ్యర్థి వికాస్ రావులపై స్పష్టమైన మెజారిటీ సాధించారు.
జగిత్యాలలో తొలుత జీవన్‌రెడ్డి 10 రౌండ్ల వరకు ఆధిక్యంలో ఉన్నా.. తర్వాత పుంజుకున్న సంజయ్ విజయం సాధించారు.
కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కె.సంజయ్ అనూహ్యంగా గెలిచారు. సమీప ప్రత్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్‌ను ఓటమిపాలు చేశారు.
ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన చిరకాల ప్రత్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై విజయం సాధించారు.
విశేషాలు—కరీంనగర్ నుండి ఎంపీ బండి సంజయ్, కోరుట్ల నుండి ఎంపీ అర్వింద్ బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో పరాజయం చవిచూశారు.
రాష్ట్రంలో వరుసగా ఏడుసార్లు గెలిచి రికార్డు సృష్టించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ 8వ సారి పోటీలో ఓడిపోయారు. ఆయన పోటీ చేసిన హుజూరాబాద్, గజ్వేల్‌లో రెండుచోట్ల ఓడిపోయారు.

