Home Page SliderTelangana

న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్‌లో ఆంక్షలు

క్రిస్టమస్,న్యూఇయర్ వేడుకలకు ఇప్పటికే హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. షాపింగ్ మాల్స్ లైటింగులతో, ప్రకటనలతో, ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ సందర్భంలో యువతను కంట్రోల్ చేయడానికి నగర కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కొన్ని ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి ఒంటిగంట దాటిన తర్వాత వేడుకలు ఉండకూడదని, పబ్‌లు, రెస్టారెంట్లు, 10 రోజులు ముందుగానే అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతీ ఈవెంట్‌లో సీసీ టీవీలు, సెక్యూరిటీ గార్డులు కచ్చితంగా ఉండాలన్నారు. పబ్‌లలో డ్యాన్సర్లతో కార్యక్రమాలపై నిషేధం ఉంటుందన్నారు. కెపాసిటీకి మించి పాస్‌లు జారీ చేయకూడదని పేర్కొన్నారు. అనుమతికి మించిన లిక్కర్ సరఫరాలు చేయకూడదని హెచ్చరించారు. అలాగే మైనర్లకు లిక్కర్‌కు అనుమతి లేదు. నిబంధనలు మీరితే కఠిన శిక్షలుంటాయన్నారు.