ధీరా ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన..
విజయనగరం: ధీరా ఫౌండేషన్ అధినేత డాక్టర్ బొత్స సందీప్ జన్మదినం సందర్భంగా వాట్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన లభించింది. నగరంలోని 25వ డివిజన్ సున్నంబట్టీ వీధిలో నిర్వహించిన కార్యక్రమంలో 90 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. కొంతమందిని శస్త్ర చికిత్సలు చేయించుకోవాలని సిఫార్సు చేశారు. పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

