రాజీనామా చెయ్.. లేకపోతే చంపేస్తాం.. సీఎంకు బెదిరింపు కాల్స్
ఈ మధ్య భారతదేశంలో బెదిరింపు కాల్స్ ల బెడద వీడడం లేదు.. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ను చంపుతామని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్ చేశారు. నవంబర్ 2 సాయంత్రం సీఎం యోగిని చంపుతామని ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ రూంకు దుండగులు కాల్స్ చేశారు. పదిరోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేయకపోతే ఎన్ సీపీ నేత బాబా సిద్ధిక్ కి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు భద్రతా దళాలను అప్రమత్తం చేశారు. సీఎం యోగి ఆదిత్యానాథ్ కు భద్రత పెంచారు.

