ఏపీలో మరో రెండు ముస్లిం కులాలకు రిజర్వేషన్లు
ఆంధ్రప్రదేశ్‌లో సామాజికంగా, విద్యలో వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. మొహమ్మద్, అబ్దుల్ అనే ఇంటి పేర్లు ఉన్న ముస్లింలకు బీసీ-ఈ ధ్రువపత్రాలు జారీ చేయాలని ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీల కమిషన్ చైర్మన్ కె.ఇక్బాల్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. ముస్లింలలోని పలు కులాలకు ఇప్పటికే 4 శాతం రిజర్వేషన్ అమలవుతోంది. మరోవైపు ముస్లిం రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేస్తూనే ఉంది.

