Breaking NewsHome Page SliderNational

ఇండియా పేరు మార్చండి

రాజ్యాంగాన్ని సవరించి ‘ఇండియా’ అనే పదాన్ని ‘భారత్’ లేదా ‘హిందూస్థాన్’తో భర్తీ చేయాలన్న సుప్రీం కోర్టు 2020 ఆదేశాన్ని కేంద్ర ప్రభుత్వం పాటించకపోవడంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇండియా అనే పేరు వలసవాద వారసత్వం అని, భారత్ అనే పేరు దేశ చరిత్ర, సంస్కృతికి ప్రతిబింబం అని ఓ పిటిషనర్ కోర్టుకు వివరించారు.రాజ్యాంగాన్ని సవరించి, ఇండియా అనే పదాన్ని “భారత్” లేదా “హిందూస్థాన్”తో భర్తీ చేయాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని వెంటనే పాటించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదనే పేర్కొన్నారు.అయితే, రాజ్యాంగ తుది వెర్షన్ రెండు పేర్లను అలాగే ఉంచింది. ఈ విషయం పరిష్కారం కాకుండా వదిలివేసింది. 2020లో సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర పాటించేలా చూడాలని పిటీష‌న‌ర్‌ విన్నవించుకున్నారు.