మాజీ సీఎం ఫ్లెక్సీలను తొలగించడం దారుణం..
మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదినం సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగించారు. తమ అగ్రనేత కేసీఆర్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తీసివేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేత జై సింహ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. తెలంగాణ తెచ్చిన మహానేత పుట్టిన రోజు సందర్భంగా పెట్టిన ఫ్లెక్సీలను తొలగించడం దారుణం అన్నారు. ఫ్లెక్సీలను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి హైడ్రా ఆఫీస్ కి బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.

