హమాస్‌కు చెందిన ట్విటర్(ఎక్స్) ఖాతాల తొలగింపు
హమాస్ ఉగ్రవాదులకు చెందిన ఎలాంటి దాడుల విషయాలను ప్రమాదకరమైన సమాచారాన్ని వ్యాప్తి చెందకుండా ఖాతాలను తొలగించామని ట్విటర్ సీఈవో లిండా యాకరినో వెల్లడించారు. ఇజ్రాయెల్‌పై భయంకర యుద్ధాన్ని చేస్తున్న హమాస్ ఉగ్రవాదుల సమాచారాన్ని తప్పుదోవ పట్టించే సందేశాలను వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఎప్పటికప్పుడు ఎక్స్‌లోని సమాచారాన్ని, సందేశాలను సమీక్షిస్తున్నామని యాకరినో తెలియజేశారు. తమ సోషల్ మీడియాలో ఇలాంటి ఉగ్రవాద సంస్థలకు, హింసాత్మక అతివాద గ్రూపులకు స్థానం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి సమాచారాన్ని ఎలా నియంత్రిస్తున్నారంటూ ఐరోపా సమాఖ్యకు చెందిన ఉన్నతాధికారి ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం వెల్లడించారు.


 
							 
							