ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు వివాదాస్పదం…
కళా దర్బార్ సంస్థ ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మదర్ థెరీసా సెంటర్లో ఏర్పాటు విషయం వివాదాస్పదమయ్యింది. అనుమతి లేదన్న
మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించడం గందరగోళానికి కారణమయ్యింది. బాలు విగ్రహం తొలగింపు పట్ల కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాగాయకుడి విగ్రహం పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అంటూ ప్రశ్నించారు. కళా దర్బార్ సంస్థ అధ్యక్షుడు పొత్తూరు రంగారావు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు చేసింది ఒక్క గుంటూరులోనే… ఐనా అధికారులు ఇలా చేయడమేంటని ఆయన మండిపడ్డారు. గుంటూరులో 200కి పైగా అనుమతి లేని విగ్రహాలు ఉన్నాయని, బాలు విగ్రహాన్ని ఎందుకు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
